Kota Maisamma | పెరిగిన కోట మైసమ్మ జాతర ఆదాయం.. ఎంతంటే?
ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర ద్వారా మొత్తం రూ.32,02,697 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో వెంకటయ్య తెలిపారు.
కారేపల్లి,అక్టోబర్ 26 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతర ద్వారా మొత్తం రూ.32,02,697 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో వెంకటయ్య తెలిపారు. ఐదు రోజులపాటు జరిగిన జాతర ముగిసిన అనంతరం సోమవారం ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.2,92,311 అధిక ఆదాయం వచ్చినట్లు ఈవో వెల్లడించారు.
జాతరలో హుండీ ద్వారా రూ.8,02,366 ఆదాయం రాగా, ద్విచక్ర వాహన పూజల ద్వారా రూ.2,12,000, పెద్ద వాహన పూజల ద్వారా రూ.2,23,000, గోత్రనామార్చన ద్వారా రూ.1,02,520, కుంకుమార్చన ద్వారా రూ.96,830, స్థలాల అద్దెల ద్వారా రూ.5,09,300, విరాళాల రూపంలో రూ.4,131 ఆదాయం సమకూరింది. వాహన పూజల అయ్యగార్లకు రూ.1,00,000, చీరల విక్రయం ద్వారా రూ.56,550 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
వేలం పాట హక్కుల ద్వారా కొబ్బరికాయలు, పూజా సామగ్రికి రూ.5,01,000, లడ్డూ, పులిహోర విక్రయాలకు రూ.1,75,000, మిఠాయిలకు రూ.1,43,000, పుట్నాలకు రూ.51,000, కొబ్బరి చిప్పలకు రూ.1,83,000, ఐస్‌క్రీమ్‌లకు రూ.43,000 ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పర్సా ట్రస్ట్, కోట మైసమ్మ దేవాలయ చైర్మన్ పర్సా పట్టాభిరామారావు, దేవాదాయ శాఖ పరిశీలకురాలు సరిత, గ్రామపంచాయతీ కార్యదర్శి నిరంజన్, దేవాదాయ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

