నందిపేట్/బోధన్/యాదగిరిగుట్ట, ఆగస్టు 12: ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి శనివారం ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సామాజిక వర్గానికి చెందిన 500 కుటుంబాల వారు జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. 30వ వార్డు రజక సం ఘం సభ్యులు తమ సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకేనని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ గ్రా మానికి చెందిన సుమారు 50 మంది ముస్లిం యువకులు కాంగ్రెస్ పార్టీని వీడి బోధన్ ఎమ్మె ల్యే మహ్మద్ షకీల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రెంజల్ మండలం నీలా గ్రామం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బబ్లూ నాయకత్వంలో వీరంతా బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సమక్షంలో బొమ్మలరామారం మం డలం కాజీపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజే పీ నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో చెర్వుఅన్నారం, చిట్యాల మండలం ఏ పూరు గ్రామానికి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యేలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.