మునుగోడు బీజేపీలో లుకలుకలు!
మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీలో చేరిన కొత్త వారు అప్పుడే బయటకు వస్తున్నారు.
- ఇమడ లేక బయటకొస్తున్న కొత్త నేతలు
- పార్టీ వైఖరి, ఆధిపత్య పోరుతో యూటర్న్
- అక్కడి నుంచి నేరుగా గులాబీ పార్టీ వైపు
- ఇటీవల వెయ్యిమంది టీఆర్ఎస్లో చేరిక
- కొత్త, పాతలతో అప్పుడే బీజేపీలో లొల్లి
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): మునుగోడు నియోజకవర్గంలోని బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. బీజేపీలో చేరిన కొత్త వారు అప్పుడే బయటకు వస్తున్నారు. బీజేపీలో ఆధిపత్య పోరు, ప్రాధాన్యం లేకపోవడం, పార్టీ వైఖరి నచ్చకపోవడంతో వంటి కారణాలతో కొత్తగా చేరిన వారంతా అందులో ఇమడలేక పోతున్నారు. ఆ పార్టీలో చేరిన కొన్ని రోజులకే వాపస్ వస్తున్నారు. నేతలే కాదు కిందిస్థాయి నాయకులు సైతం బీజేపీని వీడుతున్నారు. వారంతా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్లోకి వస్తున్నారు. మరోవైపు ఆ పార్టీలో అప్పుడే పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ తారస్థాయికి చేరుకొన్నది. కమలం పార్టీలో మొదటి నుంచీ ఉన్న నేతలు తమకు ప్రాధాన్యం దక్కడం లేదంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీలో చేరుడు.. మళ్లీ మారుడు
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. తన ప్రాభవం, బలం నిరూపించుకోవాలనే ఉత్సుకతతో ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలను ప్రోత్సహించారు. అయినోళ్లను, కానోళ్లను అందరినీ చేర్చుకొంటున్నారు. పార్టీలో చేరిన ఒకటి, రెండు రోజులకే వీరంతా ఎందుకొచ్చామా? అనే ఆవేదన చెందుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే తీరు, పార్టీ వైఖరి, సీనియర్ నేతలతో ఏకాభిప్రాయం కుదరకపోవడం, ప్రాధాన్యం దక్కకపోవడంతో కమలం పార్టీలో చేరిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఉండే పరిస్థితి లేక పార్టీని వీడుతున్నారు. కొంత మంది ఆ పార్టీలో చేరిన రోజే వెనక్కి వస్తున్నారు.
గులాబీ పార్టీలోకి క్యూ..
కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు.. అక్కడి నుంచి టీఆర్ఎస్లోకి వస్తున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకొంటున్నారు. గత ఇరవై రోజులుగా ఇలా నిత్యం వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవల బీజేపీలో చేరిన చండూరు మండలంలోని దోనిపాముల సర్పంచ్, చొప్పరివారిగూడెం సర్పంచ్, నాంపల్లి మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరారు. మరికొందరు మాత్రం బీజేపీలో చేరి తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు.
అప్పుడే పాత, కొత్త పంచాయితీ..
మొన్నటి వరకు మునుగోడు బీజేపీకి పెద్దగా క్యాడర్ లేదు. కానీ ఇటీవల ఇతర పార్టీల నేతల చేరికలతో కొత్త పంచాయితీ షురూ అయ్యింది. పార్టీని ఎప్పటి నుంచో అంటి పెట్టుకొని ఉన్న నేతలను కాదని కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పాత నేతలకు తెలియకుండా నిర్ణయాలు, కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో పాతోళ్లంతా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బహిరంగంగానే వీరు తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో చర్చలకు తెరలేపుతున్నారు. తమ బాధను స్టేటస్, ఫేస్బుక్ పోస్టుల రూపంలో వెల్లగక్కుతున్నారు. బీజేపీలో ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడం తో కార్యకర్తలు కూడా కలత చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఓటీటీలోకి వెంకీ మామ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్, నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే..!
Street Dogs | గద్వాలలో వీధి కుక్కల దాడి.. పలువురికి గాయాలు
Karthika Pournami | కార్తీక పౌర్ణమి వేళ శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Bala Krishna | బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్.. నూతన జడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే కీలక సూచనలు!
Trisha | త్రిష రాజకీయ వారసురాలంటూ ప్రకటన.. జయలలితతో పోలికలు, తమిళనాట కొత్త సేవా సంస్థ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

