ఒకే గదిలో మొత్తం సినిమా షూట్!
- వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీతో సాధ్యం
- సినిమా ప్రపంచంలోకి సరికొత్త పరిజ్ఞానం
- దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోలో
- అక్టోబర్‌లో ప్రారంభం కానున్న షూటింగులు
సినిమా తీయాలంటే సన్నివేశానికి తగ్గట్టు లొకేషన్లు వెతుక్కోవాలి.. దేశాలు దాటి వెళ్లి షూటింగ్ చేయాలి.. వీసా, విమాన టికెట్, అకామిడేషన్, షూటింగ్ సామగ్రి.. ఇలా నిర్మాతకు బోలెడంత ఖర్చు. తీరా లొకేషన్‌కు వెళ్లాక వాతావరణం బాగోలేకపోతే ఆ రోజు షూటింగ్ బంద్. ఖర్చు పెట్డిన డబ్బు వృథా. ఈ సమస్యలకు చెక్ పెట్టే అత్యాధునిక సాంకేతికతే.. వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. దీనితో ఒక చిన్న గదిలో, కావాల్సిన విధంగా మొత్తం సినిమాను చిత్రీకరించొచ్చు. ఈ సాంకేతికతను దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్ అందుబాటులోకి తీసుకొస్తున్నది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): ఎడారిలో సీన్ చిత్రీకరించాలా.. ఎడారి దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఒక పెద్ద తెరపై ఎడారి బ్యాగ్రౌండ్ కనిపించేలా చేసి.. దాని ముందు నిల్చొని నటిస్తే చాలు. సినిమా చూసేటప్పుడు నిజంగానే ఎడారిలో తీసినట్టే ఉంటుందా సీన్. దాన్ని సుసాధ్యం చేసేదే.. వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఇప్పటికే విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ భారతీయ సినీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నది. ఈ సాంకేతికతతో కూడిన వేదికను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేయబోతున్నారు. లొకేషన్, స్పేస్, బడ్జెట్ పరిమితులకు లోబడి రాసుకొన్న కథను సినిమాగా, వెబ్ సిరీస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఆన్ లొకేషన్ ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించి మొదటి షాట్ నుంచి చివరి షాట్ వరకు ప్రత్యక్షంగా చూడగలిగే, సమయం, డబ్బును ఆదా చేసే టెక్నాలజీ ఇది అని చెప్తున్నారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఒక గదిలో భారీ ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తారు. దానిపై అవసరమైన లొకేషన్లు, వస్తువులు కనిపించేలా చేస్తారు. అక్కడి వేదికపై దర్శకులు చెప్పినట్టు నటీనటులు నటిస్తే చాలు. ఎలాంటి లొకేషన్ అయినా సరే అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. కథకు అనుగుణంగా ఎంచుకొన్న లొకేషన్ల వీడియాలను చిత్రీకరించి, ఇక్కడి ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శిస్తూ.. దాని ముందు నటీనటులతో నటించేలా చేస్తారు. ఉన్న చోటే ఒక సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయొచ్చు. అన్నపూర్ణ స్టూడియోలో క్యూబ్ సినిమా సంస్థతో కలిసి వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ స్టేజీని ఏర్పాటు చేసేందుకు ఇటీవలే ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఇది అందుబాటులోకి రానున్నది.
ప్రత్యేకతలు
- 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పుతో కర్వ్డ్ డిజైన్‌లో 2.3 ఎంఎం డాట్ పిచ్‌ను కలిగి ఉంటుంది. అల్ట్రా హై రీఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గామట్, హై
- బ్రైట్నెస్ ఎల్ఈడీ స్క్రీన్స్‌తో వాల్‌ను కలిగి ఉంటుంది
- వర్చువల్, భౌతిక ప్రపంచాలను మిళితం చేస్తుంది
- ఇది గేమ్ ఇంజిన్ సాయంతో రియల్ టైంలో పనిచేసేలా ఏర్పాట్లు చేస్తారు
- బ్యాక్‌డ్రాప్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ అన్ని నేరుగా సెట్లో ఉంటాయి
- పూర్తిగా నియంత్రిత వర్చువల్ పరిసరాలలో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు
- ఒక సినిమాలో ఉపయోగించే అన్ని లొకేషన్లు ఒకే చోటకు తీసుకువచ్చి షూటింగ్స్ చేసుకొనేలా వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్ ఉంటుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

