Degree Education | డిగ్రీలో బట్టీ చదువులకు ఇక చెక్.. పాస్ అవ్వాలంటే పరీక్షల్లో వచ్చే మార్కులే ఫైనల్ కాదు!
Degree Education | డిగ్రీ స్థాయిలో రిసెర్చ్ కల్చర్ (పరిశోధనా సంస్కృతిని) పెంపొందిస్తారు. ప్రస్తుతం పీజీ ఇతర కోర్సుల్లో రిసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తుండగా, ఇక నుంచి డిగ్రీలోనూ రిసెర్చ్‌ను అమలుచేస్తారు.
Degree Education | హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): డిగ్రీలో విద్యార్థుల అటెండెన్స్‌కు మార్కులు వేసే నూతన విధానాన్ని ఉన్నత విద్యాశాఖ ప్రవేశపెట్టనున్నది. ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలులో భాగంగా విద్యార్థుల అటెండెన్స్‌కు క్రెడిట్స్ జారీ చేస్తారు. దీంతో విద్యార్థులు తరగతులకు హాజయ్యేందుకు ఉత్సాహం చూపుతారని అధికారులు భావిస్తున్నారు. పాఠ్యాంశాలను బట్టి పట్టడానికి స్వస్తి పలికి.. క్లాస్‌రూంలో కుస్తీ పట్టేలా సంస్కరణలను తెస్తున్నారు. ఫలితంగా ఇంటర్నల్స్.. సెమిస్టర్ పరీక్షల మార్కులు మారిపోతాయి. 50 శాతం మార్కులను సెమినార్లు, ఫీల్డ్ స్టడీ విజిట్స్ వంటి వాటి ద్వారా కేటాయిస్తారు. మరో 50 శాతం మార్కులను సెమిస్టర్ పరీక్షలకు నిర్వహిస్తారు. గతంలో కొన్ని వర్సిటీల్లో ఇంటర్నల్స్‌కు 30 -40మార్కులు, సెమిస్టర్ పరీక్షలకు 70-60 మార్కులను అమలుచేస్తున్నారు. ఇంటర్నల్స్‌కు 50 మా ర్కులు, సెమిస్టర్ పరీక్షలను 50 మార్కులు కేటాయిస్తారు. అన్ని వర్సిటీల్లో ఈ మార్కు ల కేటాయింపు ఒకే తరహాలో ఉండనున్నది.
ఐఎస్బీ నివేదికతో..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సిఫారసుల మేరకు ఈ విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల్లో నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలు చేయాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి, వర్సిటీలు ఈ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించాయి. ఇందుకు కమిటీలను నియమించనున్నాయి. ప్రస్తుతం విద్యార్థులు బట్టీ విధానంలో పరీక్షలు రాస్తున్నారు. సర్టిఫికెట్లు పొందుతున్నారు. కానీ వారు పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను ఆర్జించలేకపోతున్నారు. దీనికి పరిష్కారంగా సీసీఈ విధానాన్ని ప్రతిపాదించారు.
బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం
డిగ్రీ పరీక్షల మూల్యాంకనలో బ్లూమ్స్ విద్యాలక్ష్యాలను అనుసరిస్తారు. పరీక్షలను నిర్వహించి, విద్యార్థి పరిజ్ఞానాన్ని మూల్యాంకనం చేస్తారు. విద్యార్థి సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడేలా ఈ విద్యాలక్ష్యాలను రూపొందించారు. ఈ వర్గీకరణలో ఆరు స్థాయిల నైపుణ్యాలున్నాయి. జ్ఞప్తికి తెచ్చుకోవడం, అవగాహన చేసుకోవడం, విశ్లేషించడం, అప్లికేషన్ (వినియోగించడం), మూ ల్యాంకనం చేయడం, సృజనాత్మకతను ప్రదర్శించడం వంటి లక్ష్యాలున్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని, ప్రశ్నపత్రాలు, అసైన్మెంట్లను సిద్ధం చేస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

