Five day Work | వారంలో ఐదురోజుల పనిదినాలను అమలు చేయాలి : ప్రభుత్వానికి ఉద్యోగ జేఏసీ లేఖ
Five day Work | కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అమలు చేస్తున్న 5 రోజుల పనిదినాలను తెలంగాణలోనూ అమలు చేయాలని ఉద్యోగ , ఉపాధ్యాయ,గెజిడెట్, వర్కర్స్, పెన్షర్ల జేఏసీ ప్రభుత్వానికి లేఖ రాసింది.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు అమలు చేస్తున్న 5 రోజుల (Five-Day Work ) పనిదినాలను తెలంగాణలోనూ అమలు చేయాలని ఉద్యోగ , ఉపాధ్యాయ,గెజిడెట్, వర్కర్స్, పెన్షర్ల జేఏసీ ప్రభుత్వానికి లేఖ ( JAC Letter ) రాసింది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా వారంలో ఐదురోజుల పనిదినాలను అమలు చేయాలని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ( Chairman Jagadiswar ), ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ( Secretary Srinivas Rao ) కోరారు.
ఈ విధానం వల్ల ఇంధన పొదుపుతో పాటు కాలుష్యం నివారణ, ఉద్యోగుల భద్రతను కాపాడుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం ఉద్యోగులు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బదులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్వహించే అవకాశముంటుందని వెల్లడించారు .
ఈ పనిదినాల గురించి ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వాలకు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటి నుంచైనా రాష్ట్రంలో 5 దినాల పని విధానాన్ని అమలు చేయాలని లేఖలో ముఖ్యమంత్రి ని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

