ఫ్లోరిడా: ఫ్లోరిడాలోని మియామి విమానాశ్రయంలో సీపీఐ కార్యదర్శి, సీనియర్ నాయకుడు నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను విచారణ పేరుతో వేధించారు. క్యూబాలో అంతర్జాతీయ కమ్యూనిస్టు, కార్మికుల సదస్సుకు హాజరైన నారాయణ.. అక్కడి నుంచి ఫ్లోరిడా గుండా పెరూలో ఉన్న తన మనవడిని చూసేందుకు వెళ్తుండగా మియామి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు.
దాదాపు మూడు గంటలకుపైగా అధికారులు ఆయనను విచారించారు. ఈ సందర్భంగా వివిధ ప్రశ్నలతో వేధించారు. అధికారుల విచారణవల్ల మూడు గంటలకుపైగా సమయం వృథా కావడంతో నారాయణ పెరూ వెళ్లాల్సిన విమానం మిస్సయ్యింది. దాంతో విచారణ ముగిసిన తర్వాత మరో విమానంలో ఆయన పెరూకు వెళ్లాల్సి వచ్చింది.