
బంజారాహిల్స్ డిసెంబర్ 22: వైద్యరంగంలో విశేష సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఈఎన్టీ వైద్యుడు దువ్వూరి ద్వారకానాథ్‌రెడ్డి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపికయినట్టు ఐఎంఏ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. జూబ్లీహిల్స్‌లో ఉంటున్న డాక్టర్ ద్వారకానాథ్‌రెడ్డి నాలుగు దశాబ్దాలుగా వైద్యరంగంలో సేవలు అందిస్తున్నారు. ఐఎంఏ తరఫున తెలంగాణకు చెందిన వైద్యుడికి లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు రావడం ఇదే మొదటిసారని, తనకు అవార్డు దక్కడం సంతోషంగా ఉన్నదని ద్వారకానాథ్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో బీహార్‌లోని పాట్నాలో నిర్వహించనున్న ఐఎంఏ వార్షికోత్సవంలో ఈ అవార్డును అందుకోనున్నట్టు ఆయన వెల్లడించారు.