Nalgonda : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ నేతలు, నాయకులు దాడి చేశారు. నల్లగొండలోని మంత్రి క్యాంప్ ఆఫీస్‌పై కోడి గుడ్లు, టొమాటోలతో దాడికి పాల్పడ్డారు. అనంతరం మంత్రి దిష్టిబొమ్మను, క్యాంప్ ఆఫీసు దగ్గరున్న ఫ్లెక్సీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తగలబెట్టారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌పై దాడి ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అనుచరులు.. మంత్రి ఆఫీస్‌పై కోడి గుడ్లు, టొమాటోలతో దాడికి పాల్పడ్డారు. దాం తో రగిలిపోయిన కోమటిరెడ్డి వర్గం నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడికి దిగారు. ఆయన ఇంట్లోని ఫర్నిచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు.
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ ఆఫీసుపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసిన బీజేపీ నేతలు
మంత్రి కోమటిరెడ్డి దిష్టిబొమ్మను, క్యాంప్ ఆఫీసు దగ్గరున్న ఫ్లెక్సీని తగలబెట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
అనంతరం నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన… pic.twitter.com/EDjpExPsSK
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026