Tirumala | | తిరుమల భక్తుల ఆహార భద్రత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలి : టీటీడీ అదనపు ఈవో
Tirumala | తిరుమల లోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి భక్తుల ఆహార భద్రత పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు.
తిరుమల: తిరుమల ( Tirumala ) లోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని తయారు చేసి భక్తుల ఆహార భద్రత ( Food safety ) పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి అన్నారు. బ్రహ్మోత్సవాలు రానున్న నేపథ్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో హోటల్ నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో సోమవారం సమావేశం నిర్వహించారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ పరిశుభ్రత, ఫుడ్ ప్రాసెసింగ్ పై గత రెండేళ్లలో తిరుమలలోని వివిధ హోటల్ యాజమాన్యాలకు, నిర్వాహకులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. భక్తుల ఆహార భద్రతే మనందరి ప్రధమ బాధ్యత అన్నారు. ఇకపై ప్రతినెలా తప్పనిసరిగా కనీసం 10 నుంచి 5 శాంపిల్స్ తో నూతన ఆధునిక ఆహార పదార్థాల పరీక్షల్యాబ్లో టెస్టులు నిర్విహిస్తామని చెప్పారు.
ల్యాబ్ టెస్టుల్లో నిబంధనలకు అతీతంగా ఫలితాలు వస్తే రూ.5 లక్షల జరిమాన, తమకు కేటాయించిన దుకాణాన్ని సీజ్ చేసేటటువంటి చర్యలు కూడా ఉంటాయన్నారు. హోటల్ నిర్వాహకులు తమకు కేటాయించిన స్థలాన్ని దాటి ఆక్రమణలకు పాల్పడ రాదన్నారు. త్వరలో తిరుమలలోని హోటళ్లలోని వంట గదులను ఆడిటింగ్ చేసి భద్రతా ప్రమాణాలపై సర్టిఫికేట్ జారీ చేస్తామని చెప్పారు. తిను బండారాలను ఎమ్మార్పీ ధరలకు మాత్రమే విక్రయించాలని సూచించారు. హోటల్ లో పని చేస్తున్న కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వేంకటేశ్వర్లు, హెల్త్ డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

