Lionel Messi | బిగ్ బ్రేకింగ్.. ఫుట్‌బాల్‌కు మెస్సీ వీడ్కోలు..!
Lionel Messi : ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. ఇటీవలే తన తండ్రి మరణాంతరం మైదానంలోకి దిగిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Lionel Messi : ప్రపంచంలోని ఫుట్‌బాల్ అభిమానులకు షాకింగ్ న్యూస్. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ(Lionel Messi) వీడ్కోలు పలికాడు. తన ఆటతో కోట్లాదిమందిని మంత్రముగ్ధులను చేసిన ఈ దిగ్గజం సోమవారం అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు అల్విదా చెప్పేశాడు. ఇటీవలే తన తండ్రి మరణాంతరం మైదానంలోకి దిగిన ఈ ఫార్వర్డ్ ప్లేయర్ హఠాత్తుగా సంచలన నిర్ణయంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ప్రపంచ సాకర్‌లో ఓ శకం ముగిసింది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తన ఆటతో అభిమానులను ఉర్రూతలూగించిన లియోనల్ మెస్సీ వీడ్కోలు పలికాడు. అర్జెంటీనా దిగ్గజ ఆటగాడిగా, వరల్డ్‌కప్ సాధించిన కెప్టెన్‌గా అతడు తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించాడు. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో తన కెప్టెన్సీలో అర్జెంటీనాను ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలిపిన మెస్సీ.. ఈసారి కూడా గట్టిగానే ప్రయత్నించాడు. కానీ, ఫైనల్లో స్పెయిన్ కప్‌ను ఎగరేసుకుపోయింది.
The end of an era. 🐐🇦🇷
Lionel Messi announces his retirement from international football, bringing an unforgettable chapter to an end.
World Champion. Copa América winner. Argentina legend. 🏆#Messi #Argentina #Legend #GOAT pic.twitter.com/gLFBxjo8lf
— Star Sports (@StarSportsIndia) August 31, 2026
తన రిటైర్మెంట్ వార్తను ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడీ మెస్సీ. జులై 20న ఫిఫా ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి అనంతరం వీడ్కోలుపై ఆలోచించిన మెస్సీ ఎట్టకేలకు సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ‘ఫిఫా వలర్డ్‌కప్ ఫైనల్ ముగిసినప్పటి నుంచి వీడ్కోలు గురించి ఆలోచిస్తున్నా. అర్జెంటీనా ఫుట్‌బాల్ నుంచి నేను రిటైరవుతున్నాని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా. ఈ నిర్ణయం నన్నెంతగానో బాధిస్తోంది. అయినా సరే ఇదే సరైన సమయం అనిపించింది’ అని మెస్సీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో మూడు పేజీల లేఖను పోస్ట్ చేశాడీ వెటరన్.
‘అర్జెంటీనా ఫుట్‌బాల్ కోసం నేను సర్వం ధారపోశాను. గత కొన్ని ఏళ్లు సాధిస్తున్న విజయాలకు ముందు నుంచీ నేను ఎంతో చేశా. అర్జెంటీనా అభిమానులుగా మీరు సంతోషపడేందుకు, గర్వపడేందుకు తెలుపు, నీలం రంగు జెర్సీకోసం నేను ఎంతో పోరాడాను. అయితే.. ఇప్పుడు మరింత సమయం లేదు. విభిన్నమైన అధ్యాయాలు ముగియనున్నాయి. ఈ విషయం నన్ను చాలా బాధిస్తోంది. జాతీయ జట్టుకు ఆడడాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. ఎల్లప్పుడూ ఇష్టపడతాను కూడా. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు నా స్థానంలో రాబోతున్నారు’అని పేర్కొన్న మెస్సీ.. ఇకపై క్లబ్స్ తరఫున మైదానంలో ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు.ప్రస్తుతానికి ఇంటర్ మియామికి ఆడుతున్న మెస్సీ తనను ఎంతో ప్రేమించి, మద్దతుగా నిలిచిన అర్జెంటీనా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

