దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడి మృతి
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు ఆజంఘోరీకి అత్యంత సన్నిహితుడు.
చర్లపల్లి, జూలై 26 : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ అనారోగ్యంతో గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్టు చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ ఇండియన్ ముజాహిద్దీన్ వ్యవస్థాపకుడు ఆజంఘోరీకి అత్యంత సన్నిహితుడు. ఇతను 2006లో వారణాసి, 2007లో ముంబై వరుస పేలుళ్లు, 2008లో అహ్మదాబాద్, బెంగళూరుతోపాటు దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు. ఢిల్లీ కోర్టు తీర్పుతో జీవితఖైదీగా శిక్ష అనుభవిస్తుండగా.. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు దర్యాప్తులో ఇటీవల ట్రాన్సిట్ వారెంట్‌పై చర్లపల్లి జైలుకు తీసుకొచ్చారు. నెల క్రితం మక్బూల్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా గాంధీ దవాఖానకు తరలించారు. రెండు రోజుల క్రితం ఆపరేషన్ చేయడంతో ఆరోగ్యం విషమించి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

