సంగారెడ్డి, మే 21(నమస్తే తెలంగాణ) : మునుపెన్నడూ లేనివిధంగా ఒకే సంవత్సరంలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు, సైన్స్ పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీలో తెలుగువారైన చెన్నుపాటి జగదీశ్, మల్లికార్జున్‌కు ఫెలోషిప్ లభించింది.
రాయల్ సొసైటీ ఫెలోషిప్(ఎఫ్ఆర్ఎస్) దక్కించుకున్న ప్రొఫెసర్ తాటిపాముల మల్లికార్జున్ వరంగల్ వాసి కాగా, ప్రొ.చెన్నుపాటి జగదీశ్ ఆంధ్రప్రదేశ్ వల్లూరుపాలెంకు చెందినవారు. జగదీష్ పెరిగి విద్యాభ్యాసం చేసింది ఖమ్మం జిల్లాలోని ఆరెకాయలపాడు. రాయల్ సొసైటీలో ఫెలోషిప్ దక్కించుకున్న జగదీష్, మల్లికార్జున్ ఐఐటీ హైదరాబాద్‌లో విజిటింగ్ ప్రొఫెసర్లుగా సేవలు అందిస్తున్నారు. వీరిని ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బుధవారం అభినందించారు.