KTR | కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమ్మిట్ అనే కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది.
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్రపెన్యురల్ సమ్మిట్ అనే కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది.
ఐఐటీ మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది. కేటీఆర్కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ పేర్కొంది.
ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంగా నిలిచింది. రేపు, ఎల్లుండి జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, హెచ్‌సీఎల్ సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి వంటి ప్రముఖులు హాజరై ప్రసంగించనున్నట్లు ఐఐటి మద్రాస్ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- E Summit
- IIT Madras
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

