హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): డాటా సైన్స్ కోర్సుల నిర్వహణలో ఐఐటీ హైదరాబాద్ టాప్ ర్యాంకులో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ డాటాసైన్స్ డిగ్రీ విభాగంలో దేశంలోని మూడు ఐఐటీలు ఉత్తమ ర్యాంకులు పొందాయి. హైదరాబాద్ ఐఐటీ ప్రథమ ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, ఆ తర్వాత ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ గుహవాటి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.
ప్రముఖ ఎడ్యుటెక్ ప్లాట్‌ఫాం అయిన ఇమార్టికల్ లర్నింగ్స్ రిపోర్ట్-2023లో ఈ విషయం వెల్లడైంది. ఈ కోర్సుల నిర్వహణలో మన దేశంలోని ఐఐటీలే ఏటా అత్యుత్తమ ర్యాంకులను సాధిస్తుండటం విశేషం.