ఎన్పీడీసీఎల్లో ‘హైపర్’ యాక్షన్ ప్లాన్
విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని నివారించేందుకు గాను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సరిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
- ఏఐ సాంకేతికత, డ్రోన్ల ద్వారా సమస్యల గుర్తింపు
- యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తు పునరుద్ధరణ పనులు
- ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
హనుమకొండ, జూన్ 15 : విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని నివారించేందుకు గాను ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 సరిళ్లలో అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్టు సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వానకాలంలో భారీ వర్షాలు, ఈదురు గాలులతో విద్యుత్తు సరఫరాకు జరిగే అంతరాయాన్ని అధిగమించేందుకు ‘హైపర్’ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల విద్యుత్తు సరఫరా దెబ్బతినే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో సమస్యలను ముందుగానే గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పరిషరించేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
ఏటా వానకాలంలో ఈదురు గాలులతో విద్యుత్తు శాఖ ఎక్కువ ప్రభావితం అవుతుందని, ఈ క్రమంలో వినియోగదారులకు తక్కువ సమయంలో విద్యుత్తు పునరుద్ధరణ సేవలు అందించేందుకు ఈ హైపర్ ప్లాన్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. ప్రతి సరిల్లో ఎమర్జెన్సీ రెస్టోర్ టీం వాహనాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఎస్సీఏడీఏ, జీఐఎస్, ఓఎంఎస్ వంటి డాటా వ్యవస్థలను ఏఐతో అనుసంధానం చేశామని, దీంతో ఫీడర్లలో సమస్యలను ముందే అంచనా వేయవచ్చని, విద్యుత్తు డిమాండ్‌ను ముందే అంచనా వేసి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించడంతోపాటు లైన్ల పర్యవేక్షణ, నష్టాల గుర్తింపు కోసం డ్రోన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

