ICET counselling | హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే వెబ్‌కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. ఈ నెల 28 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 22 నుంచి 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. 25 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.
31 వరకు ‘ఇగ్నో’ గడువు
హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) జూలై అడ్మిషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ కే రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల గడువును 31 వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 94924 51812, 040 -23117550 నంబర్లను సంప్రదించాలని సూచించారు.