హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ ) : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను గురువారం బుద్ధభవన్‌లోని ఆయన కార్యాలయంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌ను కలిశారు. హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ లాడ్స్ నుంచి రూ. 25 లక్షలు కేటాయిస్తూ కమిషనర్‌కు లేఖను అందజేశారు. హైడ్రాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ఎంపీ చెప్పారు. హైడ్రాను ఇతర జిల్లాల్లో కూడా ఆమలు చేయాలని ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు.