Face Scan | హైదరాబాద్: ఫోన్ కెమెరాతో ముఖాన్ని స్కాన్ చేస్తే ఆరోగ్యం ఎలా ఉందో చెప్పే కొత్త సాంకేతికతను హైదరాబాద్‌లోని ఆసియానా అనే స్టార్టప్ గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఈ సంస్థ వైద్య సేవలు అందించే ‘సియానాహెల్త్’ యాప్‌ను నిర్వహిస్తున్నది.
ఈ యాప్‌లోనే ఈ కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టింది. ఇందుకోసం కెనడాకు చెందిన జెనెవా ఫేస్ స్కాన్ అనే సంస్థతో జట్టు కట్టింది. ఈ యాప్ ద్వారా 30 సెకన్ల పాటు ముఖాన్ని స్కాన్ చేస్తే 25 పారామీటర్లలో ఆరోగ్యం ఎలా ఉందో క్షణాల్లో నివేదిక వస్తుంది. బాడీ మాస్క్ ఇండెక్స్, గుండె జబ్బుల ముప్పు, గుండెపై ఒత్తిడి, మధుమేహం, బీపీ ముప్పు వంటివి తెలుస్తాయి. ఏఐ ద్వారా ఈ సాంకేతికత పని చేస్తుంది.