బాత్రూంలో 3 శవాలు!
దంపతులు సహా మానసిక స్థితి సరిగా లేని వారి కొడుకు ఇంటిలోని స్నానాల గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా భావిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలోని జెక్కాలనీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది.
- విగత జీవులుగా భార్యాభర్తలు, కుమారుడు
- సొంత ఫ్లాట్‌లోనే అనుమానాస్పద మృతి
- 6-7 గంటల తర్వాత గుర్తించిన స్థానికులు
అమీర్‌పేట్ (హైదరాబాద్), జూలై 21: దంపతులు సహా మానసిక స్థితి సరిగా లేని వారి కొడుకు ఇంటిలోని స్నానాల గదిలో విగతజీవులుగా పడి ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా భావిస్తున్న ఈ ఘటన హైదరాబాద్ సనత్‌నగర్ పరిధిలోని జెక్కాలనీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్నది. నగరంలోని సైనోడ్ కంపెనీ బిజినెస్ హెడ్ ఆర్ వెంకటేశ్ (59) తన భార్య మాధవి (52), కుమారుడు హరి (28)తో కలిసి జెక్ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్ 204లో నివాసం ఉంటున్నారు. హరికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులే కుమారునికి సపర్యలు చేస్తుంటారు. ఆదివారం ఉదయం కూడా యథావిధిగా తమ కుమారునికి స్నానం చేయించేందుకు బాత్రూమ్లోకి తీసుకెళ్లిన వీరు సాయంత్రం విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు అపార్ట్‌మెంట్స్‌లో ఇతర నివాసితుల నుంచి వివరాలను సేకరించారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలను సేకరించే పనులు చేపట్టింది.
పనిమనిషికి అనుమానం రావడంతో..
పనిమనిషి ఎప్పటిలాగే ఉదయం 11 గంటలకు వెంకటేశ్ ఇంటికి వచ్చి కిచెన్‌లో పనులు చేసుకొని వెళ్లిపోయింది. యజమానులు కనిపించకపోవడంతో ఇంటి తలుపులను దగ్గరకు వేసి వెళ్లింది. స్టీల్ బాక్స్ ఇచ్చేందుకని సాయంత్రం 4 గంటలకు వెళ్లగా, ఫ్లాట్‌లో ఎటువంటి అలికిడి లేకపోవడంతో అనుమానం వచ్చింది. ఆ తర్వాత 6.30 గంటలకు స్థానిక మహిళ విజయలక్ష్మితో కలిసి వెళ్లి చూసినా ఎవరూ కనిపించలేదు. మాస్టర్ బెడ్రూమ్లోని బాత్రూమ్ తలుపులు తెరిచి చూసేందుకు ప్రయత్నించగా అవి తెరుచుకోలేదు. వెంటనే విషయాన్ని వాచ్మెన్ ద్వారా అపార్ట్మెంట్ వాసులకు వివరించారు. వారు సనత్‌నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారొచ్చి తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి ముగ్గురూ మృతి చెంది కనిపించారు. కొద్దిరోజులుగా వివిధ ఫ్లాట్లలో విద్యుత్తు సమస్యలు తలెత్తుతున్నాయని, వీటిని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు నివాసితులు చెప్తున్నారు. మరణాలు సంభవించిన ఫ్లాట్‌లో మాత్రం గీజర్ గ్యాస్ సిలిండర్ ఆధారంగా నడుస్తుండటంతో విద్యుదాఘాతం జరిగే అవకాశం లేదని తెలుస్తున్నది. పోస్ట్‌మార్టం జరిగితే కానీ మృతికి గల కారణాలు తెలిసే వీలులేదని భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని బాలానగర్ డీసీపీ సురేశ్‌కుమార్, ఏసీపీ హనుమంతరావు పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

