
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ డిజిటల్ బిజినెస్ చానల్ హైబిజ్ టీవీ వార్షిక మీడియా అవార్డులను జనవరి 29న ప్రదానం చేయనున్నట్టు ఆ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలుగు, ఇంగ్లిష్ భాషలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో మీడియాలో ప్రతిభ కనబర్చినవారికి ఏటా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డులను జర్నలిజం, అడ్వర్టయిజ్మెంట్, సర్క్యులేషన్తో సహా వివిధ విభాగాల్లో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, రెడియోలలో పని చేస్తున్న అత్యత్తమ ప్రతిభావంతులను గుర్తించి, గౌరవించడమే తమ లక్ష్యమని హైబిజ్ టీవీ పేర్కొన్నది. హైబిజ్ అవార్డులకు నామినేషన్లు పంపించేందుకు ఈ నెల 8 నుంచి 29 వరకు గడువు విధించినట్టు తెలిపింది. అవార్డుల బహూకరణ కార్యక్రమాన్ని జనవరి 29న గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలను www. hybiz.tv/awards కు లాగిన్ అయి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.