IOB Jobs | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
IOB Jobs | బ్యాంక్ ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అవకాశం కల్పించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
IOB Jobs | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB) వివిధ కేటగిరీల్లో 291 జనరలిస్ట్, స్పెషలిస్ట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. వీటిని జేఎంజీ స్కేల్ 1, ఎంఎంజీ స్కేల్ 2, ఎంఎంజీ స్కేల్ 3 పోస్టులను భర్తీ చేయనున్నది. అర్హులైన, అనుభవజ్ఞులైన వారు ఈ పోస్టులకు సెప్టెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీలు
మేనేజర్(బ్రాంచ్ మేనేజ్మెంట్) 100
మేనేజర్ (ఐటీ) 65
మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) 5
మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్) 5
సీనియర్ మేనేజర్ (ఐటీ) 10
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) 3
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆడిట్) 2
సీనియర్ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్) 10
సీనియర్ మేనేజర్ (నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్) 5
సీనియర్ మేనేజర్ (సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్) 5
మేనేజర్ (క్రెడిట్) 35
సీనియర్ మేనేజర్ (క్రెడిట్) 15
సీనియర్ మేనేజర్ (రిస్క్) 6
అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ) 25

Iob Posts
అర్హతలు
పోస్టును బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ (సీఎస్, ఐటీ) ఉత్తీర్ణులై ఉండాలి. ఉద్యోగానుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 25 నుంచి 45 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5, ఓబీసీలకు 3, దివ్యాంగులకు 10, ఎక్స్సర్వీస్మెన్లకు 5 వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు 1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు రూ. 175.
ఎంపిక
ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షలో 1/4వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంది. ఆన్లైన్ పరీక్షకు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీతో మెరిట్ లిస్టును తయారు చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి బేసిక్ పే రూ. 48,480 నుంచి 1,05,280+ ఇతర అలవెన్సులు ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చివరితేదీ సెప్టెంబర్ 15. ఇతర వివరాలకు వెబ్సైట్ www.iob.bank.inలో చూడండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

