Hyderabad | భార్య ఉరేసుకుంటుండగా వీడియో తీసిన భర్త
Hyderabad | తాగుడుకు బానిసైన భర్తను ఆ వ్యసనం నుంచి మాన్పించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించగా.. ఎలా చస్తావో చూస్తానంటూ వీడియో తీయడం ప్రారంభించిన భర్త.. చివరకు అన్నంత పనీ చేసి తనువు చాలించిన భార్య.. అయ్యో.. కేవలం ఆమె తనను బెదిరిస్తున్నదని అనుకున్నానంటున్న భర్త.. భార్య అనంత లోకాలకు.. భర్త జైలుకు వెళ్లిపోగా.. వారి ఇద్దరి పిల్లలు మాత్రం బిక్కుబిక్కుమంటూ అనాథలుగా మిగిలారు.
Hyderabad | మెహిదీపట్నం, డిసెంబర్ 12: తాగుడుకు బానిసైన భర్తను ఆ వ్యసనం నుంచి మాన్పించేందుకు ఆత్మహత్య చేసుకుంటానని భార్య బెదిరించగా.. ఎలా చస్తావో చూస్తానంటూ వీడియో తీయడం ప్రారంభించిన భర్త.. చివరకు అన్నంత పనీ చేసి తనువు చాలించిన భార్య.. అయ్యో.. కేవలం ఆమె తనను బెదిరిస్తున్నదని అనుకున్నానంటున్న భర్త.. భార్య అనంత లోకాలకు.. భర్త జైలుకు వెళ్లిపోగా.. వారి ఇద్దరి పిల్లలు మాత్రం బిక్కుబిక్కుమంటూ అనాథలుగా మిగిలారు.
హృదయవిదారకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మురాద్‌నగర్ సయ్యద్ అలీగూడలో నివసించే రసూల్, అర్షియా బేగం (23) దంపతులకు ఐదేండ్ల క్రితం పెండ్లయ్యింది. అయితే రసూల్‌కు అదివరకే పెండ్లి కాగా.. ఆ విషయాన్ని దాచి అర్షియాను కూడా చేసుకున్నాడు. దీనికితోడు అతడికి మద్యం అలవాటు కూడా ఉండటంతో వీరిద్దరి మధ్య దాదాపు ప్రతిరోజు గొడవలు జరిగేవి. మానసికంగా క్రుంగిపోయిన అర్షియా సోమవారం రాత్రి భర్తను ప్రవర్తన మార్చుకోవాలంటూ నిలదీసింది.
దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ వేధింపులు తట్టుకోలేనని, ఇక ఆత్మహత్యే శరణ్యమంటూ ఆమె ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. మద్యం మత్తులో ఉన్న రసూల్.. ఆమెను మరింత రెచ్చగొడుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీయడం ప్రారంభించాడు. అన్నంత పని చేసిన అర్షియా తనవు చాలించింది. ఆమె తనను బెదిరిస్తున్నదని భావించి వీడియో తీశానని, నిజంగా చనిపోతుందని ఊహించలేదని భర్త పోలీసుల ముందు వాపోతున్నాడు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

