సిరిసిల్ల : భార్య మృతితో మానసిక వేదనకు గురైన ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తంగాళ్లపల్లి మండలం నెరేళ్ల గ్రామంలో కోడిముంజ ప్రశాంత్ భార్య ఇటీవల మృతి చెందింది. దీంతో భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేక ప్రశాంత్(25) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.