Wife Murder | వివాహిత దారుణ హత్య.. భార్యను కొట్టి చంపిన భర్త
Wife Murder | భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది.
Wife Murder | కట్టంగూర్, నవంబర్ 1 : భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన వేముల సుమలత(30)ను కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరడ మహేశ్‌కు ఇచ్చి 2024 డిసెంబర్ 6న వేములకొండ గుట్టపై వివాహం జరిపించారు. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం మృతురాలి సోదరి సుజాతతో పాటు ఆమె బంధువులకు మహేశ్ ఫోన్ చేసి రాత్రి సుమలత కొట్టి చంపానని.. వచ్చి తీసుకెళ్లాలని తెలిపాడు.
దీంతో వారు 100కు డయల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడగా సుమలత చెవి, మెడ, వెన్నుపూసపై బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయింది. సుమలతను చంపిన అనంతరం మహేశ్ ఆమె మీద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని పరారయ్యాడు. తన కూతురు హత్యకు కారణమైన మహేశ్‌తో పాటు అతని సోదరులు మురళి, గిరి, అత్తమామలపై మృతురాలి తల్లి వేముల మారెమ్మ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. నకిరేకల్ ఇన్చార్జి సీఐ వెంకటేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో మహేశ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యను వేధించడంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
Woman poses as TTE on train | రైలులో టీటీఈగా నటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
వృథాగా పోతున్న రాంపురం పెద్ద చెరువు నీరు
India Won: కివీస్‌తో తొలి వన్డే.. 5 వికెట్ల తేడాతో ఇండియా గెలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

