Sriram Sagar | శ్రీరాంసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద
ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాతోపాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ (Sriram Sagar Project), నిజాం సాగర్ ప్రాజెక్టుల్లోకి (Nizam Sagar Project) భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద (Floods) పోటెత్తడంతో అధికారులు 4 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి 12 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1090.8 అడుగులకు చేరింది.
ఇక నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రాజెక్టులోకి 2500 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో జలాశయంలో నీటిమట్టం 1,403.7 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు. నిజాం సాగర్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, ఇప్పుడు 16 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

