65వ జాతీయ రహదారిపై భారీగా పెరిగిన వాహనాల రద్దీ
Panthangi | సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోతున్నాయి. ఇక హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు తమ సొంతూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఫాస్టాగ్ ఉన్నప్పటికీ ప్రయాణికులు తమ వంతుకోసం వేచిచూడాల్సి వస్తున్నది. దీంతో ఎప్పటికప్పుడు వాహనాలు వెళ్లిపోయేలా అధికారులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

ఇందులో భాగంగా విజయవాడ మార్గంలోనే 10 టోల్ ప్లాజాలను తెరిచారు. గతంలో మూడు సెకండ్లు ఉన్న ఫాస్టాగ్ సెన్సర్‌ను ప్రస్తుతం రెండు సెకండ్లకు కుదించారు. దీంతో రెండు సెకన్ల వ్యవధిలోనే వాహనాలు టోల్‌ప్లాజా నుంచి బయటకు వెళ్తున్నాయి. ఇలా నిమిషానికి 20 వాహనాలు టోల్ ప్లాజా నుంచి బయటపడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

