నిర్మల్ : జిల్లాలోని బాసరలో ఉన్న ఆర్జీయూకేటీ -బాసర ( RGUKT Basar ) , పీయూసీ-1, ఇ-1, ఇ-2 విద్యార్థులకు ఆర్జీయూకేటీ అకడమిక్ విభాగం సెలవులను ( Holidays ) ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
యూనివర్సిటీలో చదువుతున్న పీయూసీ-1 , ఇ-1 ,ఇ-2 విద్యార్థులకు ఈ నెల 23 నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు అకడమిక్ అండ్ ప్లానింగ్ అసోసియేట్ డీన్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల విద్యా క్యాలెండర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తరగతులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని వివరించారు. విద్యార్థులు ఈ విరామ సమయాన్ని వృధా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు. తదుపరి ఆదేశాల కోసం యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ లేదా సమాచార మాధ్యమాలలో చూసుకోవాలని సూచించారు.