ACB | హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ మూడో రోజు కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివబాలకృష్ణను ఏసీబీకి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శివబాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై నిన్న, మొన్న ఆరా తీశారు. ఆయనకు చెందిన 8 బ్యాంకు లాకర్లు, డిపాజిట్లు, కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. 18 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించింది.