బడంగ్‌పేట, మే 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని మీర్‌పేటలో ‘హిట్ అండ్ రన్’ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారం గాయత్రీ నగర్ నుంచి ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్ వైపు వెళ్తున్న జిలానీ, ఆయన కుమారుడు ఫైజల్‌ను ఓ క్యాబ్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఫైజల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై వాగ్వాదం జరుగడంతో జిలానీపై క్యాబ్‌లోని వ్యక్తి దాడి చేశాడు. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్ నీలకంఠం సత్యనారాయణ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఆపేందుకు జిలానీ ప్రయత్నించాడు.
ఆ క్రమంలో జిలానీ బానెట్‌పై ఉన్నప్పటికీ కారును ఆపకుండా డ్రైవర్ దాదాపు 2 కి.మీ. దూరం లాక్కెళ్లాడు. బాలాపూర్వైపు వేగంగా వెళ్లిన ఆ క్యాబ్ తిరిగి మందమల్లమ్మ చౌరస్తా వద్దకు రాగానే స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కారును ఆపిన డ్రైవర్.. జిలానీని వదిలి పరారయ్యాడు. బ్యానెట్‌పై లాక్కెళ్లడంతో జిలానీకి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో మీర్‌పేట పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడు నీలకంఠం సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.