హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పిడి విధానానికి (హిల్ట్ పాలసీకి) పరిశ్రమల నుంచి స్పందన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. దరఖాస్తులు రాకపోవడంతో ఎస్ఆర్వో రేట్లను జూన్ 30 వరకు పొడిగించేది లేదని తెలిపింది. ఈ మేరకు హిల్ట్ పాలసీపై మార్గదర్శకాలు విడుదల చేసింది.
హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల్లో ఉన్న పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీకి పెద్దగా స్పందన లేకపోవడంతోపాటు బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు ఈ పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు 10% డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజును ముందస్తుగా చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది. దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది.