సంగారెడ్డి : హిజ్రాల వేషధారణతో నకిలీ ట్రాన్స్ జెండర్(Fake transgender)గా చెలామణి అవుతూ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తికి హిజ్రాలు దేహశుద్ధి(Hijras attacked) చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన జిల్లాలోని జోగిపేట(Jogipet)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్ అనే యువకుడు హిజ్రాల వేషధారణతో స్థానికంగా వసూళ్లకు పాల్పడుతున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు హిజ్రాలు యువకుడిని పట్టుకుని చితకబాదారు. సమాజంలో తాము ఎన్నో అవమానాలను భరిస్తూ పొట్టకూటి కోసం అనేక ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి నకిలీ ట్రాన్స్జెండర్ వల్ల తమకు ఇబ్బందులు ఎదరురవుతున్నాయని పలువురు హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ హిజ్రాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.