అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడండి.. అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లపై హైలెవల్ కమిటీ సమావేశమైంది. ఆపరేషన్ సింధూర్, మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ అభ్యాస్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర అత్యవసర విభాగాలతో తాజా పరిణామాలను ముఖ్యమంత్రి సమీక్షించారు.. ఇలాంటి సందర్భాల్లో తీసుకోవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు, పార్టీలకు సంబంధించిన వివాదాలకు తావులేదని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయా విభాగాలకు స్పష్టంగా పలు ఆదేశాలిచ్చారు.
మంత్రులు, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని సూచించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు. వైద్యం, పౌర సరఫరాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.
పరిస్థితిని ఆసరా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, సైబర్ సెక్యూరిటీ విభాగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన కఠినంగా వ్యవహరించాలన్నారు. ఫేక్ న్యూస్‌ను, పుకార్లు వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.
రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో 24 గంటలు అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రతను పెంచాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగవద్దని అన్నారు. అలాగే హైదరాబాద్‌లోని రక్షణ రంగ సంస్థల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన వారికి తగిన రక్షణ కల్పించాలన్నారు. కేంద్ర నిఘా బృందాలతో రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలన్నారు.
హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సందర్భంగా పీస్ కమిటీలతో సమావేశం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పాత నేరస్తులు, ఇతర నేర చరిత్ర కలిగిన వారిపట్ల పోలీసులు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు, ఇతర అత్యవసర విభాగాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సైన్యానికి మద్దతుగా రేపు ర్యాలీ
సైన్యానికి మద్దతుగా రేపు సాయంత్రం ర్యాలీ తీయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సంఘీభావ ర్యాలీలో యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

