వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామ పరిధిలో డీఆర్డీవో వినియోగిస్తున్న ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూమిని చట్టప్రకారం చేపట్టిన భూసేకరణ ప్రక్రియను వారంలోగా పూర్తిచేసి పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
- రావిర్యాల డీఆర్డీవో భూముల విషయంపై హైకోర్టు హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): లేనిపక్షంలో సంబంధిత బాధ్యులైన అధికారులపై కోర్టు ధికరణ చర్యలు తప్పవని హెచ్చరించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో కంచా ఇమారత్లోని సర్వే నం.1/1లోని 16.19 ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులదని కింది కోర్టు తేల్చి చెప్పింది.
ఈ ఉత్తర్వులు అమలుచేయాలని కింది కోర్టు ఆదేశించినా ఫలితం లేకపోవడంతో సయ్యద్ మహమ్మద్ షాబుద్దీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ఇప్పటికే ఈ భూమి డీఆర్డీవో పరిధిలో ఉండటంతో చట్టప్రకారం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. అయినా అమలు కాకపోవడంతో బాధితుడు కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు నెలల గడువిచ్చినా ఫలితం లేక షాబుద్దీన్ మరో కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ఇది ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని అన్నారు. అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైందని, సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ ఎస్టేట్ అధికారి జూన్ 5న భూసేకరణ ప్రతిపాదనలు పంపారని చెప్పారు. వీటి ప్రకారం జూన్ 27న కందుకూరు ఆర్డీవో భూసేకరణ అధికారిని నియమించారని, 29న ప్రకటన కూడా జారీ అయిందని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి.. విచారణను ఈనెల 16కు వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

