హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): బదిలీపై ఇతర రాష్ట్ర హైకోర్టులకు వెళ్తున్న జస్టిస్ చిల్లకూరు సుమలత, జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్‌కు హైకోర్టు సోమవారం వీడోలు చెప్పింది. మొదటి కోర్టు హాల్లో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే అధ్యక్షతన జరిగిన సమావేశం బదిలీపై వెళ్తున్న జడ్జీల సేవలను కొనియాడింది. హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (హెచ్ సీఏఏ) ఇద్దరు న్యాయమూర్తులను సన్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ సుమలత మాట్లాడుతూ.. తాను ఎకడికి వెళ్లినా తెలంగాణ ప్రతిభను చాటాలే విధులు నిర్వహిస్తానని అన్నారు. బార్, బెంచ్ ఒకే నాణేనికి ఇరువైపులా ఉంటాయని జస్టిస్ సుధీర్‌కుమార్ అన్నారు. జస్టిస్ సుమలత కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ సుధీర్‌కుమార్ మద్రాస్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.