కేటాయింపులు ఇంకెన్నాళ్లకు పూర్తిచేస్తారు.. ఉద్యోగుల విభజనపై నిలదీసిన హైకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏండ్లు దాటినా ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఇంకా ఎన్నాళ్ల సమయం పడుతుందంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది.
- ఏపీకి ప్రొఫెసర్లను రిలీవ్ చేయడంపై
- మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ
- తదుపరి విచారణ 29కి వాయిదా
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 12 ఏండ్లు దాటినా ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు ఇంకా ఎన్నాళ్ల సమయం పడుతుందంటూ ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివాదం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నందున ఇకడ మధ్యంతర ఉత్తర్వులను పొడిగించలేమని స్పష్టం చేసింది.
హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ప్రస్తుతం గాంధీ మెడికల్ కాలేజీలో డిప్యుటేషన్పై కొనసాగుతున్న రత్నం ఆండాళు, మహేశ్వరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రీలక్ష్మిని ఏపీకి కేటాయిస్తూ సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రిలీవ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వారు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై లక్ష్మణ్, జస్టిస్ సుజన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

