Singareni Elections | ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు.. వాయిదాకు హైకోర్టు నో
సింగరేణి (Singareni) కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యధావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు (High Court) కొట్టివేసింది.
హైదరాబాద్: సింగరేణి (Singareni) కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు యథావిధిగా జరుగనున్నాయి. ఎన్నికల వాయిదా వేయాలన్న సంస్థ యాజమాన్యం దాఖలు చేసిన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు (High Court) కొట్టివేసింది. ఈ నెల 27న ఎన్నికలు జరిపించేందుకు వీలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందని, ఎన్నికల నిర్వహణకు కొంత సమయం ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 17న దీనిపై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ గుర్తింపు కార్మిక సంఘానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో డిసెంబర్ 27న జరగాల్సిన ఎన్నికలకు మార్గం సుగమమయింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

