ఖమ్మం కమాన్‌బజార్, సెప్టెంబర్ 18 : ఖమ్మంలోని శ్రీనివాసనగర్‌లో నివసిస్తు న్న 683 మంది పట్టాదారులపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ ఖమ్మం మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
హైకోర్టులో శుక్రవారం కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ కొనసాగింది. శ్రీనివాసనగర్‌లో నివసిస్తున్న 683 మంది పట్టాదారుల తరఫున సామల రవీందర్, సుధాకర్, పుప్పాలపల్లి నిరోష్ వాదించారు. మున్సిపల్ అధికారులు ఇండ్లను తొలగిస్తే పేదలు రోడ్డు న పడతారని న్యాయవాదులు కోర్టు దృ ష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని జస్టిస్ సూచించారు.