బంజారాహిల్స్, జూన్ 11: సృజనాత్మక ఆలోచనలతో వినూత్న ఆవిష్కరణలపై ఆసక్తి కలిగిన విద్యార్థులకు టీహబ్ మంచి అవకాశాలు అందజేస్తున్నదని ఆ సంస్థ సీఈవో శ్రీనివాసరావు మహంకాళి పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీలోని ఎస్‌యూ నాలెడ్జ్ హబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇన్నోవేటర్స్ ఫెస్ట్’ కార్యక్రమాన్ని మంగళవారం టీహబ్ సీఈవో శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఇన్నోవేషన్, స్టార్టప్, హెల్త్‌కేర్ విభాగాల్లో విద్యార్థులు రూపొందించిన పలు నమూనాలను తిలకించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే సృజనాత్మక ఆలోచనలతో ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మహ్మద్ వలీవుల్లా, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, జోగేందర్ తనికెళ్ల, డాక్టర్ అబ్దుల్ ముఖీద్,
తదితరులు పాల్గొన్నారు.