మళ్లీ యురేనియం లొల్లి!
పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం కృష్ణా పరీవాహక ప్రాంతం పెద్దగట్టు శివారులోని శివార్లపెంట వద్ద ఓ హెలికాప్టర్ రెండ్రోజులుగా చక్కర్లు కొడుతున్నది.
- నల్లమలలో రెండ్రోజులుగా చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్
- నిక్షేపాల కోసం సర్వే చేస్తున్నట్టు స్థానికుల అనుమానం
పెద్దఅడిశర్లపల్లి, మార్చి 10: పదేండ్లుగా ప్రశాంతంగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో మళ్లీ యురేనియం అలజడి మొదలైంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం కృష్ణా పరీవాహక ప్రాంతం పెద్దగట్టు శివారులోని శివార్లపెంట వద్ద ఓ హెలికాప్టర్ రెండ్రోజులుగా చక్కర్లు కొడుతున్నది. చిన్న యంత్రాన్ని ఏర్పాటు చేసి తక్కువ ఎత్తులో భూమిపైకి వదులుతూ తిరుగుతున్నది. దాంతో స్థానికులు యురేనియం కోసమే సర్వే చేస్తున్నారని భావిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి సాగర్ వెనుక జలాల మీదుగా పెద్దగట్టు, నంభాపురం ప్రాంతాల్లో సర్వే చేపడుతున్నట్టు స్థానికులు భావిస్తున్నారు. 25 ఏండ్ల క్రితమే యురేనియం నిక్షేపాలను గుర్తించిన యూసీఐఎల్ (యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్), భారత అణు ఇంధన సంస్థ సర్వే చేపట్టి ఇక్కడ బోర్లు వేయించాయి. మండలంలోని పెద్దగట్టు, నంభాపురం, పెద్దమూల ప్రాంతాలు కృష్ణా పరీవాహకం కింద ఉండటంతో సాగర్ జలాలు కలుషితమైతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని స్థానికులు ఆందోళన చేపట్టారు. దీంతో 2003లో అప్పటి కలెక్టర్ సిసోడియా ఆధ్వర్యంలో పీఏపల్లి, శేరిపల్లి వద్ద ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. పలు పార్టీలు, ప్రజా సంఘాలు, పర్యావరణ వేత్తలు వ్యతిరేకించారు. అప్పటి శాసనసభ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఫలితంగా సర్వే నిలిపేశారు. ప్రస్తుతం నేరుగా కాకుండా.. ఆంధ్రా సరిహద్దు నుంచి వచ్చి హెలికాప్టర్ ద్వారా సర్వే చేపడుతున్నారని ఈ ప్రాంత వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

