TG Rains | రాబోయే 48 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు..!
TG Rains | గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 48 గంటల్లో రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
TG Rains | హైదరాబాద్ : గత నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాబోయే 48 గంటల్లో రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిన్న అత్యధికంగా జనగామ జిల్లాలోని దేవరుప్పులలో 11.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్ నగరంలో నిన్న వాన దంచికొట్టిన విషయం తెలిసిందే. సరూర్‌నగర్, రాక్ టౌన్ కాలనీ, నాగోల్‌లో అత్యధికంగా 86 మి.మీ., బండ్లగూడలో 75.5 మి.మీ., హబ్సిగూడలో 70.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రామాంతపూర్‌లో 51 మి.మీ., హయత్‌నగర్‌లో 50.55 మి.మీ., ఉస్మానియా యూనివర్సిటీలో 42.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసక పరిపాలనకు ధన్యవాదాలు.. కేటీఆర్ ఎద్దేవా
KTR | నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారు..! రేవంత్ తీరుపై కేటీఆర్ ధ్వజం
Yadadri Laddu | యాదగిరిగుట్ట ప్రసాదాలపై అప్రమత్తం.. హైదరాబాద్ ల్యాబ్‌కు నెయ్యి నమూనాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

