Weather Update | రాష్ట్రంలో వచ్చే 5 రోజులు భారీ వానలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గడిచిన 24గంటల్లో నిజామాబాద్, ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
- 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Weather Update | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఉపరితల ఆవర్తన ప్రభావంతో గడిచిన 24గంటల్లో నిజామాబాద్, ఆదిలాబాద్ , ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నవీపేటలో 15.4 సెం.మీ, ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 13.7 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాగల ఐదురోజులు రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నెల 19నాటికి పశ్చిమ మధ్య ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేరొన్నది. ఈ మేరకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లును 1070, 112, 18004250101 ఏర్పాటు చేసినట్టు విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు పేరొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

