Rain alert | మూడు రోజులు భారీ వర్షాలు.. 16 జిల్లాలకు హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
Rain alert | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నది. ఆది, సోమవారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, నల్లగొండ, ఖ మ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు కురుస్తాయని, ఆ మేరకు ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది. మిగతా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అలాగే, రేపు, ఎల్లుండి అధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

