వచ్చే 5 రోజులు భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
- చురుగ్గా నైరుతి రుతుపవనాలు
హైదరాబాద్, జూన్9 (నమస్తేతెలంగాణ): దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 040-21111111, 9001136675 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. యాదాద్రి-భువనగిరి, మల్కాజ్గిరి, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణ్‌పేట్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షంతో పాటు గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | ‘వారణాసి’ రిలీజ్ డేట్ మారనుందా .. ఏప్రిల్ నుంచి ఆగస్టుకు వాయిదా అంటూ ప్రచారం
Eklavya | సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ఏఐ నటుడితో లయన్స్‌గేట్ ప్లే ‘ఏకలవ్య’ వెబ్ సిరీస్!
North Karnataka | కొన్నేళ్లలో ప్రత్యేక రాష్ట్రంగా ఉత్తర కర్ణాటక: బీజేపీ ఎమ్మెల్యే
Flipkart | ఫ్లిప్‌కార్ట్ సీఈవో రాజీనామా..11 ఏండ్ల ప్రయాణానికి ముగింపు
‘ప్రజలు గ్రామాభివృద్ధికి సహకరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

