హైదరాబాద్: రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారుజామున యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు, గుండాల మండలాల్లో, నల్లగొండ జిల్లాలోని కనగల్, తిప్పర్తి, చండూరు, మునుగోడు, దేవరకొండ, సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు మండలాల్లో కుండపోతగా వాన పడింది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ మోస్తు వర్షం నమోదయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హయత్‌నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, బేగంపేట్, సికింద్రాబాద్‌లో వర్షం పడింది. కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, బోయిన్పల్లి, బాలానగర్, మూసాపెట్, ఎర్రగడ్డలో భారీగా వాన పడింది. దీంతో వర్షపు నీరు లోతట్టు ప్రాంతల్లోకి చేరింది.