SRSP project | ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద
SRSP project | ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriramsagar project) భారీ వరద(Heavy flood)పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లో 532క్యూసెక్కులుగా ఉంది.
నిజాబాబాద్ : ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (Sriramsagar project) భారీ వరద(Heavy flood)పోటెత్తింది. ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా ఔట్ ఫ్లో 532క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1069.50 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం.90.31 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 22.436 టీఎంసీలుగా ఉంది.
అలాగే కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని నిజాంసాగర్(Nizamsagar project) ప్రాజెక్టుకు వరద స్వల్పంగా మొదలైందని అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 715 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నది. 17 టీఎంసీల నీటి సామర్థ్యానికి ప్రస్తుతం మూడు టీఎంసీలుగా ఉంది. ఇక శ్రీశైలం జలాశయానికి 1,73,504 క్యూసెక్కుల వరద వస్తున్నది. 1,21,171 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 255 మీటర్ల వద్ద నీటిమట్టం ఉండగా, 58.59 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

