Telangana | నమస్తే తెలంగాణ కథనానికి స్పందన.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి దామోదర
Telangana | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన 'మళ్లీ పెరిగిన కడుపు కోతలు' కథనంపై ఆయన స్పందించారు.
Telangana | ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన ‘మళ్లీ పెరిగిన కడుపు కోతలు‘ కథనంపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని.. అందుకు అవసరమైన అవగాహనను గర్భిణులకు కల్పించాలని అధికారులకు సూచించారు. సిజేరియన్ ఆపరేషన్లకు అడ్డుకట్ట వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వివిధ జిల్లాల్లో ఉన్న జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సాధారణ డెలివరీలు జరిగేలా చర్యలు చేపట్టాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలంటే సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరించి.. అందుకు అవసరమైన అవగాహన కల్పించి సాధారణ డెలివరీలను ప్రోత్సహించాలని కోరారు.
జగిత్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా వైద్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని అధికారులను అదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?


