హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రైతు, కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీని ఓడించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కన్వీనర్ పశ్య పద్మ పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల వేదిక పిలుపులో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తం గా ట్రాక్టర్, వాహనాల ర్యాలీలను నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఏఐటీయూ సీ రాష్ట్ర కార్యాలయంలో పశ్య పద్మ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోర్చా కన్వీనర్లు టీ సాగర్, బాల మల్లేశ్, రాయల చంద్రశేఖర్, బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్రాజ్, సీఐటీయూ, ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 26న హైదరాబాద్లో సుందరయ్య పార్ నుంచి ఇందిరాపార్ వరకు జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.