Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Harish Rao | ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.
Harish Rao | ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా ఇతర రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, సామాజికవేత్తలు, రైతులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో17 జారీ చేయడాన్ని హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవో జారీ కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ, దుర్మార్గ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, రైతు మెడకు ఊరేసేందుకేనా ఈ కుట్ర అని ప్రశ్నించారు.
వ్యవసాయానికి, గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీయడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు విమర్శించారు. రైతు డిస్కమ్ ఏర్పాటు వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమిటి? రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఈ నిర్ణయం ఎలా దోహదపడుతుందో చెప్పకుండా మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. సర్కార్ నిర్వాకంతో అన్నదాత మరింత ఇబ్బందుల్లో పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే దిక్కు లేదు.. రేపు రైతు డిస్కం తో మరింత ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉందని అన్నారు. రైతు మెడకు రైతు డిస్కం ఉచ్చు..ఉచిత విద్యుత్ పై చేతులెత్తేసేందుకే సర్కార్ కొత్త ఎత్తుగడ అని తెలిపారు. పంటలు ఎండి రైతు కన్నీరు పెడుతుంటే.. డిస్కంల పేరిట రేవంత్ సర్కార్ రాజకీయ చదరంగం ఆడుతున్నదని అన్నారు.
జీవో ప్రకారం కొత్త డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, HMWSSB, మిషన్ భగీరథ.. మొత్తంగా 30,62,853 కనెక్షన్లు రైతు డిస్కం కి బదిలీ చేశారని హరీశ్‌రావు తెలిపారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా సాధ్యం అవుతుందని ఆయన ప్రశ్నించారు. కేవలం 25శాతం థర్మల్ పవర్ అలకేషన్ తో రైతులకు సాగు, ప్రజలకు తాగు నీళ్లకు అవసరం అయ్యే భారీ విద్యుత్ వ్యవస్థ ఎలా నడుస్తుందని నిలదీశారు. 6,15,651 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల వ్యవసాయ ఎల్టీ లైన్లు.. వీటి నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోతే రైతుల కష్టాలకు ఎవరు బాధ్యత వహిస్తారని అడిగారు.
రాష్ట్ర విద్యుత్ కేటాయింపుల్లో ఇప్పటికీ 53.28 శాతం థర్మల్ విద్యుత్తే ఉందని.. సౌర విద్యుత్తు వాటా 35.31 శాతం మాత్రమే అని హరీశ్‌రావు తెలిపారు. ఇందులో థర్మల్ 25%, సోలార్ 58%, హైడల్ మొత్తంగా 100% రైతు డిస్కమ్ కు కేటాయించారని అన్నారు. పగటి పూట మాత్రమే సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయితే, రాత్రి పూట ఉండదని చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పే ప్రభుత్వం.. పగటిపూట మాత్రమే విద్యుత్ ఇచ్చి, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టబోతోందా అని అనుమానం వ్యక్తం చేశారు.
2325 MW హైడల్ (జల విద్యుత్) పవర్ మొత్తం రైతు డిస్కమ్కే కేటాయించారని హరీశ్‌రావు తెలిపారు. కానీ ఈ హైడల్ పవర్ సాంకేతికంగా ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. అంటే మిగతా 8 నెలలు రైతు డిస్కమ్‌కి ఈ విద్యుత్ అందుబాటులో ఉండదు. అప్పుడు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొత్త డిస్కమ్‌కు భారీ రుణాలు, బకాయిలను కేటాయిస్తూ.. దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఏం భరోసా ఇస్తోంది? ఈ అప్పుల భారం చివరకు రైతులపై పడేయాలని చూస్తున్నారా? రైతు డిస్కమ్ పేరుతో వ్యవసాయ విద్యుత్ బాధ్యతలను వేరుచేసి, రేపు నష్టాల సాకుతో రైతులపై ఆంక్షలు విధించే ప్రమాదం లేదా అని నిలదీశారు.
రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, 24 గంటల సరఫరాలో ఎలాంటి కోతలు ఉండవని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వగలదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల అనుమానాలను నివృత్తి చేయకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లడం కుదరదని అన్నారు. కొత్త సంస్థ ఏర్పాటుతో అదనపు పరిపాలనా ఖర్చులు ఎంత? ఆ ఖర్చులను ఎవరు భరిస్తారు? ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీపై పూర్తి వివరాలను ప్రభుత్వం బహిర్గతం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతుల పేరుతో డిస్కమ్ ఏర్పాటు చేయడం గొప్ప కాదు.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడం ముఖ్యం. సంస్థల పేర్లు మార్చడం, కొత్త సంస్థలు ఏర్పాటు చేయడం కాదు.. రైతుల విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు..
రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే వారి అభ్యంతరాలను పక్కనపెట్టి ఎందుకు ముందుకెళ్తున్నారు? ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పకుండా చాటు మాటుగా జీవో జారీ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులకు భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల్లో అనుమానాలు, ఆందోళనలు ఎందుకు పెంచుతోందని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. రైతు డిస్కమ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ఆర్థిక భారం, సిబ్బంది నిర్వహణపై పూర్తి వివరాలు వెల్లడించాలని సూచించారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్లకూడదని చెప్పారు. రైతు డిస్కమ్ ఏర్పాటు వెనుక రైతుల ప్రయోజనాలే లక్ష్యమైతే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.. లేదంటే తక్షణం జీవో ఉపసంహరించుకోవాలి అని యావత్ రైతాంగం పక్షాన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- farmers
- harish rao
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

