రైతు డిస్కమ్ పేరుతో ఉచిత విద్యుత్తుకు ఎసరు
జీవో 17తో అన్నదాతల మెడకు ఉరివేయొద్దు.. తక్షణమే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.. లేకపోతే బీఆర్ఎస్ పక్షాన ఆందోళనలు చేస్తాం.. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు హెచ్చరిక
హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : రైతు డిస్కమ్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలకు ఉచిత విద్యుత్తును దూరం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూ టీ ఫ్లోర్‌లీడర్ టీ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్తోపాటు విద్యుత్తురంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలు, రైతు లు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పట్టించుకోకుండా రైతు డిస్కమ్‌ను ఏర్పా టు చేస్తూ జీవో 17 జారీ చేయడాన్ని మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఖండించారు. రైతు మెడకు ఉరివేసే విధానాలను, జీవోను తక్షణమే ఉపసంహరించుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
నిర్వహణ లేక రైతులకు ఇబ్బందులు
కొత్తగా తెచ్చిన జీవో ప్రకారం 30.60 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ సీములు, మిషన్ భగీరథ, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ పరిధిలోనివి కలిపి మొ త్తం 30,62,853 కనెక్షన్లను రైతు డిసమ్ కు బదిలీ చేశారని హరీశ్ తెలిపారు. 6.15 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు, 2.51 లక్షల సర్యూట్ కిలోమీటర్ల ఎల్టీ లైన్లతో కూడిన ఇంతటి భారీ వ్యవస్థను కేవలం 2వేల మంది సిబ్బందితో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే మార్చే వారు కరువయ్యారని, రేపు తీవ్ర ఇబ్బందులు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర విద్యుత్తు లభ్యతలో 53.28 శాతం థర్మల్ విద్యుత్తు ఉంటే, రైతు డిసమ్కు 25 శాతం థర్మల్ విద్యుత్తును మాత్రమే కేటాయించారని చెప్పారు. పగటిపూట మాత్రమే లభించే సోలార్ వి ద్యుత్తును 58శాతం, ఏడాదిలో కేవలం 3-4 నెలలు మాత్రమే ఉత్పత్తయ్యే హైడల్ వి ద్యుత్తును 100శాతం కేటాయించడం వెను క ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మిగతా ఎనిమిది నెలలపాటు కరెంట్ ఎలా ఇస్తారని, రైతులను చీకట్లోకి నెట్టేందుకే ఈ నిర్ణ యం తీసుకున్నారా? అని నిలదీశారు.
పీఎంయూ టెండర్లు రద్దు చేయండి
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నిత్యావసర సరుకుల సరఫరా కోసం తెచ్చిన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని హరీశ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ గురుకుల కాం ట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు హరీశ్‌ను ఆయన నివాసంలో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొత్త విధానం వల్ల వేలాది స్థానిక చిరు వ్యాపార కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పంచించిన హరీశ్‌రావు.. నోట్ బుకుల కొనుగోళ్లలో రూ.2వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని, ఇప్పుడు నిత్యావసరాలపై కూ డా 20శాతం మేర కమీషన్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

